ఎం.ఈ.ఓ-1 పరిపాలన
ఎం.ఈ.ఓ-2 పర్యవేక్షణ
విద్య విద్యేతర విషయాలను పర్యవేక్షించడం ఎం.ఈ.ఓ-2 విధి.
అదే విషయాలపై పరిపాలన పరమైన చర్యలు తీసుకునేది ఎం.ఈ.ఓ-1
ఉదాహరణకు నాడు-నేడులో జరుగుతున్న పనులను పర్యవేక్షించడం, సూచనలు ఇవ్వడం మాత్రమే ఎం.ఈ.ఓ-2 పరిధి.
నాడు-నేడు నిధుల పరమైన నిర్ణయాలు, చర్యలు, అదనపు నిధులు, బ్యాంక్ ఖాతాలు, ఆమోదాలు మొదలైవి ఎం.ఈ.ఓ-1 పరిధి.
టీచర్ సమయానికి పాఠశాలకు వస్తున్నారా? పాఠాలు చెప్తున్నారా? అనే పర్యవేక్షణ ఎం.ఈ.ఓ-2 చూస్తారు.
టీచర్స్‌పై సమయానికి రానందుకు చర్యలు, పాఠం చెప్పనందుకు చర్యలు, వారి జీతాలు, వారి సెలవులు, వారి పరిపాలనాపరమైన ఇతర అంశాలు ఎం.ఈ.ఓ-1 పరిధి.
దీనిలో ఎలాంటి గందరగోళానికి తావులేదు.
మీరు కార్యాలయానికి వస్తే మీకు ఎం.ఈ.ఓ-1 సంతకమే అవసరం. మీరు తీసుకుంటారు.
మీ పాఠశాలకు ఎం.ఈ.ఓ-2 వచ్చి పర్యవేక్షణ చేస్తే ఆ పర్యవేక్షణ చేసినట్లుగా ఎం.ఈ.ఓ-2 సంతకం వారే స్వయంగా చేస్తారు.
Comments
Post a Comment