Income Tax Software 2024-25 by Rayuduspothan

SBI లోన్ తీసుకున్న వారికి న్యూస్.. బ్యాంక్ ఈ నిర్ణయంతో మీ EMIలు పెరగనున్నాయ్

SBI లోన్ తీసుకున్న వారికి  న్యూస్.. బ్యాంక్ ఈ నిర్ణయంతో మీ EMIలు పెరగనున్నాయ్.

 
 ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేట్లను (MCLR) సవరించింది.


అన్ని కాలపరిమితులపై ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. సవరించిన రేట్లు ఏప్రిల్‌ 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీని ప్రభావంతో గృహ, వాహన, ఇతర రుణాలు ప్రియం కానున్నాయి.

ఓవర్‌నైట్‌, ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను 10 బేసిస్‌ పాయింట్ల మేర ఎస్‌బీఐ పెంచింది. 

దీంతో గతంలో 6.65 శాతంగా ఉన్న ఈ రేటు 6.75 శాతానికి చేరింది. 

 ఆరు నెలల కాలపరిమితిపై ఎంసీఎల్‌ఆర్‌ 7.05,

ఏడాది కాలపరిమితిపై 7.10 శాతం, రెండేళ్ల కాలపరిమితిపై 7.30, 

మూడేళ్ల కాలపరిమితిపై 7.40 శాతానికి ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను సవరించినట్లు ఎస్‌బీఐ తెలిపింది. 

మరోవైపు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BoB) కూడా ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను 0.0.5 శాతం మేర ఇటీవల పెంచింది. ఏప్రిల్‌ 12 నుంచి ఈ రేట్లు అమల్లోకి వచ్చినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆ బ్యాంక్ పేర్కొంది.

 ఏమిటీ ఎంసీఎల్‌ఆర్‌..?

బ్యాంకుల్లో నిధుల లభ్యత, వాటిని సమీకరించేందుకు అయ్యే ఖర్చులను గణించి, ఆ తర్వాత రుణాలను ఏ వడ్డీ రేటుకు ఇవ్వాలన్నది నిర్ణయించేదే ఎంసీఎల్‌ఆర్‌. రుణం తీసుకునేందుంకు బ్యాంకుకు వెళ్లే వారికి ఈ రేటును ప్రామాణికంగా తీసుకుని వడ్డీ రేట్లను నిర్ణయిస్తారు. ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు రుణం అందించే అవకాశముండదు. గతంలో ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించడంతో ఈ రేట్లు భారీగా తగ్గాయి. సాధారణంగా రెపోరేటును సవరించినప్పుడు ఈ రేట్లూ మారుతూ ఉంటాయి. ఇటీవల ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ ఎస్‌బీఐ ఈ రేట్లను సవరించడం గమనార్హం. దీని ప్రభావంతో ప్రస్తుతం రుణాలు తీసుకున్న, భవిష్యత్‌లో తీసుకోబోయే రుణ గ్రహీతలకు ఈఎంఐ భారం పెరగనుంది.

Comments