E-Filing చేసుకొనుటకు సూచనలు
➡️Financial Year (FY) 2021-22 అనగా Assessment Year (AY) 2022-23(01.04.2021 to 31.03.2022) సంవత్సరానికి సంబంధించిన Income Tax Return e-filing ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యింది.
అయితే మన
➡️DDO లు TDS పూర్తి చేసిన తర్వాతనే మనం E Filing చేసుకొవలసి ఉంటుంది.
➡️ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ కోసం గత సంవత్సరం జూన్ 7 నుంచి ప్రారంభమైన కొత్త సైట్ ప్రారంభమైంది. వాస్తవానికి మనం ఈ ఫైలింగ్ ప్రతీ సంవత్సరం జులై 31 లోగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పరిస్ధితులను బట్టి ప్రభుత్వం ఈ గడువు పెంచవచ్చు.
➡️గమనించవలసిన ముఖ్యవిషయం ఏమంటే ఇన్కమ్ టాక్స్ రిటర్న్ (ఈ - ఫైలింగ్) అనేది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేయాల్సిందే. 2,50,000 పైబడిఆదాయం కలిగిన వారందరూ *ఇన్కమ్ టాక్స్ పడనప్పటికీ* తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి.
➡️75 సంవత్సరాల సూపర్ సీనియర్ సిటిజన్స్ వారి ఆదాయం 5 లక్షల లోపు అయితే ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం నుండి మిన హాయింప బడ్డారు.
➡️ఇన్కమ్ టేక్స్ కడితేనే ఈ ఫైలింగ్ చేయాలి లేకపోతే అక్కరలేదు అనుకోవడం పొరపాటు. టేక్స్ తో సంభంధంలేకుండా రెండున్నర లక్షల వార్షికాదాయం దాటిన వారంతా ఈ ఫైలింగ్ చేయాలి.కారణం ఏదైనా ఎవరేని ఈ-ఫైలింగ్ చేయని వారికి రెండు మూడు సంవత్సరాల తరువాత కూడా ఐ టీ డిపార్టుమెంటు నుండి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది.
➡️ఇన్కమ్ టాక్స్ సైట్ లో మనం ఈ ఫైలింగ్ ఎలా చేయాలో పరిశీలించుదాం.
www.incometax.gov.in.
➡️సైట్ లో ఇన్కమ్ టాక్స్ రిటరన్స్ ఈ ఫైలింగ్ ద్వారా సబ్మిట్ చేయాలి. వ్యక్తులు, వ్యాపార సంస్థలు ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి , రిఫండ్ కోరడానికి, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ సైట్ ఉపయోగపడుతుంది.
➡️ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ కు పాన్ నెంబర్ గానీ ఆధార్ నెంబరు గానీ యూజర్ ఐడి గాఉపయోగించాలి. పాస్వర్డ్ సహాయంతో మనం ఈ ఫైలింగ్ పేజీలో ప్రవేశించ గలుగుతాం.
➡️పాస్ వర్డ్ మరచిపోయిన సందర్భంలో forget పాస్ వర్డు ఆప్షన్ ద్వారా ఇ మెయిల్, ఫోన్ నెంబరు సహాయంతో దిగ్విజయంగా ఈ ఫైలింగ్ సైట్ లోకి ప్రవేశించవచ్చు.
➡️ఐటీ రిటర్న్స్ ఈ ఫైలింగ్ చేయడానికి మనం ముందుగా గమనించాల్సినవి.
➡️1.పాన్ మరియు ఆధార్ లింక్ అయి ఉండాలి.
➡️2. ఆధార్ మన మొబైల్ నెంబర్ కు లింక్ చేయబడి ఉండాలి.
➡️3. మన బ్యాంకు ఖాతా కు మొబైల్ నెంబర్ లింక్ చేయబడి ఉండాలి.
(గమనిక- ఈ మూడు అంశాలు లో ఏది లేకపోయినా ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయలేము.)
➡️4. మన జీతం/ పెన్షన్ వివరాలతో డి డి ఓ ఇచ్చిన ఫారం16 / పెన్షనర్లు ఫిబ్రవరి పేస్లిప్ దగ్గర ఉంచుకోవాలి.
(గమనిక -టేక్స్ పే చేసిన పెన్షనర్లకు సంబంధిత ట్రెజరీలలో Form 16 ఏప్రియల్ నెలనుండి ఇస్తారు .టేక్స్ పడని పెన్షనర్లు పిబ్రవరి పేస్లిప్ లో ఉన్న Form 16 వివరాలతో ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు.)
➡️5. లింక్ అయిన మొబైల్ దగ్గర ఉండాలి.
➡️ప్రస్తుతం I T ఈ ఫైలింగ్ పేజీలో పాన్ ,ఆధార్ లింక్ అవ్వడం ద్వారా మన వివరాలు ఉంటాయి.వాటిని ఎడిట్ చేసుకోవడానికి, అప్డేట్ చేయడానికి అవకాశం ఉంది. మన ఫోటో కూడా ఆధార్ సైట్ నుండి కానీ నేరుగా గాని ఇక్కడ అప్డేట్ చేయ వచ్చు.
➡️New users అయితే మనం individual tax payer దగ్గర క్లిక్ చేసి
➡️1. బేసిక్ డీటెయిల్స్ లో పాన్ నెంబర్, నేమ్, డేట్ అఫ్ బర్త్, జెండర్, రెసిడెన్షియల్ స్టేటస్ ఫిల్ చేయడంకానీ ఉన్న వివరాలను అప్డేట్ చేయడం గానీ ఎడిట్ ఆప్షన్ ద్వారా చేసుకొనే అవకాశం ఉంది.
➡️2. కాంటాక్ట్ డీటెయిల్స్ లో సెల్ నెంబర్, అడ్రస్ వివరాలు పూర్తి చేయాలి. మన మొబైల్ ఓటీపీ ద్వారా వాలిడేట్ చేయాలి.
➡️3. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయాలి..
➡️గతంనుండి ఐటి ఫైల్ చేస్తున్న ఎక్సిస్టింగ్ యూసర్స్ వివరాలు ప్రీఫిల్ చేసిఉంటాయి .. సరిచూసుకోవడం అవసరమైతే ఎడిట్ చేయడం చేయవచ్చు.
➡️మనం ఇపుడు ఐటి రిటరన్ ఫిల్ చేయడం గురించి చూద్దాం!!
➡️లాగిన్ అయి అసెసెమెంట్ ఇయర్ ఎంటర్ చేసి Online filling ఆప్షన్ ఎంపిక చేసి Status లో individual సెలక్ట్ చేసి మనకు వర్తించే ఐ టి ఆర్ ఫారం సెలక్ట్ చేయాలి. మనం ITR 1 ఎంచుకోవాలి.
➡️ఇక్కడ మనం 3 steps follow కావాల్సి ఉంటుంది.
1 Validate Your returns
2Conform your return summery
3.Verify and submit your return అనేవి.
➡️1. Validate your return లో 5 అంశాలు ఉంటాయి.
1. Personal information
2.Gross total Income
3.Total deductions
4 Taxes paid
5. Total Tax Liability లను ఒకటి పూర్తి చేసిన తరువాత మరొకటి క్లిక్ చేసి ఓపన్ చేసి ఫిల్ చేసుకోవాలి.
Comments
Post a Comment