We have updated the software on 03/02/2026. Always download the latest version for the latest updates. Use fresh file for each employee.

పీపీఎఫ్ వర్సెస్ సుకన్య సమృద్ధి యోజన..రాబడి పరంగా రెండిటిలో ఏది బెస్ట్‌?

PPF vs SSY

 పీపీఎఫ్ వర్సెస్ సుకన్య సమృద్ధి యోజన..

రాబడి పరంగా రెండిటిలో ఏది బెస్ట్‌..!?

చాలా మంది ఏ పథకంలో పెట్టుబడి పెట్టాలి.. ఎంత రాబడి వస్తుంది.. అనే సందేహంతో ఉంటారు.

 సుకన్య సమృద్ధి యోజన అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఇందులో కూతురి పేరు మీద మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. కానీ పీపీఎఫ్‌లో ఎవరి పేరుతోనైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.

 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం. అదే సమయంలో సుకన్య సమృద్ధి యోజన (SSY)పై 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టడం బాగుంటుంది.

 కానీ ఈ రెండు పథకాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. PPFలో తక్కువ వడ్డీ వచ్చినప్పటికీ దీర్ఘకాలికంగా మంచి రాబడి వస్తుందిని నిపుణులు చెబుతున్నారు.

PPFలో 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.15 సంవత్సరాల తర్వాత మీరు దానిని 5 సంవత్సరాలకు పొడిగించవచ్చు.

 మీరు రెండు పథకాలలో పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు పెట్టుబడిపై మినహాయింపు పొందుతారు.

 మీరు సంవత్సరానికి కనిష్టంగా రూ. 500 గరిష్టంగా రూ. 1.50 లక్షలను PPF ఖాతాలో జమ చేయవచ్చు.

సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టడానికి కనీస మొత్తం రూ.250. ఈ పథకంలో ఏడాదికి కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. 

కుమార్తె చదువు/పెళ్లి నిమిత్తం ఈ పథకం ప్రారంభించారు. ఈ కారణంగా PPF కంటే ఎక్కువ రేటును ఇందులో ఉంచారు. కుమార్తెకు 15 ఏళ్లు వచ్చే వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. 

16 నుంచి 21 సంవత్సరాల మధ్య ఎటువంటి డిపాజిట్ అనుమతించరు. కానీ ఖాతాదారుడు డిపాజిట్ మొత్తంపై వడ్డీని పొందుతాడు.

మీరు ప్రతి సంవత్సరం PPF ఖాతాలో రూ.1.50 లక్షలు డిపాజిట్ చేస్తే మీరు ప్రస్తుత వడ్డీ రేటు (7.1 శాతం) ప్రకారం 15 సంవత్సరాల మెచ్యూరిటీపై రూ. 40.68 లక్షలు పొందుతారు.

 అలాగే సుకన్య సమృద్ధి యోజనలో 21 ఏళ్ల మెచ్యూరిటీపై ప్రతి సంవత్సరం రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేస్తే మీకు 63.65 వేల రూపాయలు లభిస్తాయి. 

పిల్లలకి 10 సంవత్సరాల వయస్సులోపు మాత్రమే ఈ ఖాతా ఓపెన్ చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.

Comments