*VR—VOLUNTARY RETIREMENT*
*సందేహలు....సమాధానం.*
1. VR తీసుకోదలిస్తే ఎన్నినెలల ముందు దరఖాస్తు పెట్టుకోవాలి? దరఖాస్తు ఎవరికి చేయాలి? ఏయే పత్రాలు జతపర్చాలి?
Ans: VR తీసుకోదలిస్తే 3 నెలల ముందు నియామకపు అధికారికి నోటీసు (దరఖాస్తు) ఇవ్వాలి. మూడు నెలల లోపు ఇచ్చే నోటీసులను సైతం నియామకపు అధికారి అనుమతించవచ్చు. ఉపాధ్యాయుల విషయంలో మండల పరిధిలోని టీచర్లు MEO ద్వారా, హైస్కూల్ టీచర్లు HM ద్వారా DEO కు ఏ తేదీ నుంచి VR అమల్లోకి రావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెల్పుతూ నోటీసు ఇవ్వాలి. స్పెసిఫిక్ గా జత చేయాల్సిన పత్రాలేవీ లేవు.
2. VR ఏయే కారణాలపై తీసుకోవచ్చు?
Ans: వ్యక్తిగత, అనారోగ్యం తదితర కారణాలను చూపవచ్చు.
3. ఒక టీచరుకు అక్టోబర్ 2018 నాటికి 20 ఏళ్ళ సర్వీస్ పూర్తవుతుంది. అక్టోబర్ తర్వాత VR తీసుకుంటే పూర్తి పెన్షన్ వస్తుందా?
Ans: 20 ఏళ్ళ నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ పూర్తి చేస్తే VR కి ఎలిజిబిలిటీ వస్తుందికానీ, పూర్తి పెన్షన్ రాదు.
4. ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాక VR తీసుకోదలిస్తే... వెయిటేజీ ఎన్ని సంవత్సరాలు Add చేస్తారు?
Ans: క్వాలిఫయింగ్ సర్వీస్ కు.... సూపరాన్యుయేషన్ (58/60 ఏళ్ళు) కి గల తేడాను వెయిటేజీగా Add చేస్తారు. అయితే... దీని గరిష్ట పరిమితి ఐదేళ్లు.
5. Loss of Pay, Long Leave (medical grounds) లో ఉండి VR కి దరఖాస్తు చేయవచ్చా?
Ans: Yes.
6. Medical Leave లో ఉండి, స్కూల్లో జాయిన్ అయ్యాకే VR కి అప్లై చేయాలా? సెలవులో ఉండి VR తీసుకోవడం ప్రయోజనమా?
Ans: సెలవులో ఉండి VR తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకోరాదు. స్కూల్లో జూయిన్ అయి VR తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకొని సెలవు కాలానికి పూర్తి వేతనం పొందే అవకాశం ఉంటుంది.
7. అక్టోబర్ 2018 నుంచి VR తీసుకుంటే కొత్త PRC వర్తిస్తుందా?
Ans: 11 వ PRC.... ఫస్ట్ జులై, 2018 నుంచి అమల్లోకి రావాల్సి వుంది. వస్తుందనే నమ్మకమూ నాకుంది. అయితే... నోషనలా? మానిటరీ బెనిఫిట్ ఉంటుందా? అనే విషయాన్ని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం!
8. VR తీసుకున్న తర్వాత GI కంటిన్యూ చేయవచ్చా? GI అమౌంట్ ఎంత వస్తుంది?
Ans: VR తవ్వాత గ్రూప్ ఇన్సూరెన్సు కంటిన్యూ అయ్యే అవకాశంలేదు. ప్రభుత్వం ఏటేటా విడుదల చేసే టేబుల్ ప్రకారం అమౌంట్ వస్తుంది.
9. చివరగా ఒక ప్రశ్న. 20 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ సర్వీస్ మధ్య VR తీసుకుంటే పెన్షన్ ఎంతెంత వస్తుంది?
Ans: వెయిటేజీతో కలుపుకొని 33 ఏళ్ళ సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అయితే.... చివరి Basic Pay లో 50 % పెన్షన్ గా నిర్ధారించబడుతుంది.
అలా కాకుండా VR తీసుకుంటే....
నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ > పెన్షన్
20>37.87% (చివరి మూలవేతనంలో)
21>39.4%
22>40.9%
23>42.4%
24>43.93%
25>45.45%
26>46.97%
27>48.48%
28>50%
(ఈ టేబుల్ 58 ఏళ్ళ వయస్సు నిండి ఉద్యోగ విరమణ చేసే వారికీ వర్తిస్తుంది.)
Comments
Post a Comment